NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

1 min read

ప్రజలకు మంత్రి టీజీ భరత్ పిలుపు

సంకల్ బాగ్ వద్ద ‘ఒక రోజు – ఒక గంట – ఒకే తాటిపై’ కార్యక్రమం

కర్నూలు, న్యూస్​ నేడు:  గురువారం నగరంలో పరిశుభ్రతను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాల స్వచ్ఛతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ పిలుపునిచ్చారు. గురువారం సంకల్ బాగ్ తుంగభద్ర నది ఒడ్డున స్వచ్ఛతా హి సేవా–2026లో భాగంగా “ఒక రోజు – ఒక గంట – ఒకే తాటిపై” (ఏక్ దిన్ – ఏక్ ఘంటా – ఏక్ సాథ్) కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి మంత్రి టీజీ భరత్ చీపురు పట్టుకుని పరిసరాలను స్వయంగా పరిశుభ్రం చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు భాగస్వామిగా మారినప్పుడే పరిశుభ్రమైన నగరం సాధ్యమవుతుందని అన్నారు. మన వీధి, మన ప్రాంతం, మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని సూచించారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు ముందుకు రావాలని కోరారు. పరిశుభ్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కర్నూలును పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు.కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టి సారించి, పలు కార్యక్రమాలను చేపడుతోందన్నారు. అయితే ప్రజల భాగస్వామ్యం సైతం ఎంతో కీలకమని, ప్రజల సహకారంతో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని తెలిపారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ప్రతి నెల ప్రజల సంతృప్తి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా, తడి–పొడి చెత్తను వేర్వేరుగా అందించి పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని సూచించారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇతరులకు కూడా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కోరారు. “మన నగరం – మన బాధ్యత” అనే భావనతో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కర్నూలును పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, ఎంఈ మనోహర్ రెడ్డి, డిఈఈ పవన్ కుమార్ రెడ్డి, ఏఈ వైష్ణవి, సానిటరీ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున, స్వచ్ఛ సర్వేక్షన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *