“గుండెపోటు ను అత్యవసరంగా గుర్తించి స్పందిస్తే నే ప్రాణాలు కాపాడగలరు”..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అడిషనల్ డీఎంఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె చిట్టి నరసమ్మ… “కర్నూలు మెడికల్ కాలేజీలో పుల్లారెడ్డి డెంటల్ కాలేజీ పిజిలకు సీసీఎల్ఎస్ శిక్షణ”… కార్డియాక్ అరెస్టును అత్యవసరంగా గుర్తించడం వెంటనే స్పందించి వైద్యం అందించగలిగితే ప్రాణాలు కాపాడవచ్చునని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె చిట్టి నరసమ్మ అన్నారు. బుధవారం కర్నూలు మెడికల్ కాలేజీలోని అనస్థీషియ విభాగం ఆధ్వర్యంలో స్కిల్ ల్యాబ్ యందు పుల్లారెడ్డి డెంటల్ కాలేజీ పిజి లకు నిర్వహించిన రెండురోజుల సీసీఎల్ఎస్ (CCLS – Comprehensive Cardiac Life Support) పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ:”కార్డియాక్ అరెస్ట్ సమయంలో తొలి కొన్ని నిమిషాలు అత్యంత కీలకం. సరైన సమయంలో సరైన విధానంలో CPR, డీఫిబ్రిలేషన్ మరియు ఇతర అత్యవసర చర్యలు చేపట్టడం ద్వారా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అనస్థీషియా విభాగపు అధిపతి సుధీర్, ప్రొఫెసర్ విశాల, ప్రొఫెసర్ l రామ్ శివ నాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణలత, అసిస్టెంట్ ప్రొఫెసర్లు జయదేవ్, రాథోడ్, భారతి, సుమియా బేగం,రఘు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


