రాజ్య సభ సభ్యులు ఆర్ కృష్ణయ్యకు ఘన సన్మానం
1 min read
కమ్యూనిటీ హాల్ కు రూ. 90 లక్షలు ఎంపీ లాడ్స్ ఇచ్చిన ఎం పీ
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రాజ్య సభ సభ్యులు ఆర్. కృష్ణయ్య కార్యాలయం లో శనివారం కర్నూలు జిల్లా కురువ సంఘం అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం కె. రంగస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, బి. వెంకటేశ్వర్లు, కే.టి. ఉరుకుందు, జిల్లా కోశాధికారి కే సీ నాగన్న, అల్లూరు వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షులు తవుడు శ్రీనివాసులు ఘనంగా సన్మానించారు. కమ్యూనిటీ హాల్ కు రూ. 90 లక్షలు ఎంపీ లాడ్స్ మంజూరు చేయించిన నేపథ్యంలో సంఘం నాయకులు కృష్ణయ్యను కలిసి సన్మానించారు. కమ్యూనిటీ హాల్ కు రూ. 1.50 కోట్లు విలువ చేసే స్థలాన్ని ఇచ్చిన దాత పాల సుంకన్నను కృష్ణయ్య, సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో ఎక్కువ మంది గెలుపునకు కృషి చేయమని సంఘము నాయకులకు సూచించారు, స్థల దాత టి. పాల సుంకన్న ను ఉద్దేశించి మాట్లాడుతూ నీవు స్థలమిచ్చి కమ్యూనిటీ హాల్ మరియు హాస్టల్ నిర్మాణం కోసం కృషి చేసినందుకు మీ సేవలు శాశ్వతం నీ త్యాగానికి జోహార్లు అనే కొనియాడారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణ భూమి పూజకు ఎంపీ నీ ఆహ్వానించారు. జిల్లా కురువ సంఘం నాయకులు కె. విజయ్., సురేష్, ఓబులేసు, విద్యార్ధి సంఘం నాయకులు కె. జోషి తదితరులు పాల్గొన్నారు.


