NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంబాసిడర్ డా. రాయపాటి శ్రీనివాస్‌కు ప్రతిష్ఠాత్మక  అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  అంతర్జాతీయ శాంతి, అహింస, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ చర్యలు, మానవతా సేవలు మరియు మహాత్మా గాంధీజీ సిద్ధాంతాల ప్రచారం కోసం అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా అల్లీ & లయన్. అంబస్సిడర్. డా. రాయపాటి శ్రీనివాస్ కి ప్రతిష్ఠాత్మక ఇంటర్నేషనల్ హయ్యర్   గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు.మహాత్మా గాంధీజీ 157వ జయంతి సందర్భంగా . సత్యాగ్రహ్ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు మదర్ తహీరా చారిటబుల్ ట్రస్ట్, బెట్టియా, వెస్ట్ చంపారన్ బీహార్ సంయుక్తంగా ఈ గౌరవాన్ని అందించినట్లు డా. రాయపాటి శ్రీనివాస్ శాంతి, అహింస, సత్యాగ్రహం, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన, సుస్థిర అభివృద్ధి,  మానవతా సేవల ద్వారా సమాజానికి సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ డాక్టరేట్‌ ను ప్రధానం చేసారు. ముఖ్యంగా మహాత్మా గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి, మానవత్వం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు  వివిధ ప్రపంచ దేశాల ప్రముఖులతో 20 కి పైగా అంతర్జాతీయ స్థాయి స మన్వయంతో చేస్తున్న కార్యక్రమాలు ప్రశంసనీయమని ఈ సందర్భంగా డా. రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్ తన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాకుండా, శాంతి, అహింస, మానవతా సేవలు మరియు పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్న ప్రతి సేవకుడికి లభించిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ గుర్తింపు తనపై మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులో కూడా గాంధీజీ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని శాంతి, సామాజిక న్యాయం, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ మరియు మానవతా సేవల కోసం మరింతగా పనిచేస్తానని పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *