స్థానిక సంస్థల ఎన్నికలకు సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సమాయత్తం
1 min read
పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధతపై ఆలూరు నియోజకవర్గ సమావేశం
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ముందుకు సాగాలి నాయకుల పిలుపు
హోళగుంద న్యూస్ నేడు: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్ డి పి ఐ) సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశం హోళగుంద మండలంలో అసెంబ్లీ అధ్యక్షుడు ఎఫ్. అబ్దుల్ హమీద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల సన్నద్ధత, మండల స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై పోరాటం తదితర కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశానికి ఎస్ డి పి ఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ముల్లా ఇర్ఫాన్, రాష్ట్ర కార్యదర్శి సుభాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాల్సిన ఆవశ్యకతపై నాయకులు దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడానికి కీలకమైనవని పేర్కొన్నారు. గ్రామాల్లో నెలకొన్న తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, వైద్యం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి ప్రజలకు సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి అవసరాలు, అభిప్రాయాలకు ప్రాధాన్యతనిస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు.ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలు, గ్రామాల్లో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో చర్చించారు. పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, యువతను, ప్రజాసేవపై ఆసక్తి ఉన్నవారిని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని నాయకులు సూచించారు.రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఆలూరు అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కే. సలాం, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, కార్యదర్శి హాఫీజ్, కోశాధికారి అల్లాబకాష్తో పాటు ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో పార్టీ బలోపేతం, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి పలు అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించుకోవాలని నిర్ణయించారు.


