యువ క్రాంతి బునియాది ట్రైనింగ్ క్యాంపు
1 min read
పాల్గొన్న ఏలూరు జిల్లా, నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, యువజన కాంగ్రెస్ కార్యకలాపాలు, నాయకత్వ లక్షణాలు,ప్రజా సమస్యలపై పోరాట అంశాలే శిక్షణ లక్ష్యం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గుంటూరు:ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహిస్తున్న యువ క్రాంతి బునియాది ట్రైనింగ్ క్యాంపులో ఏలూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లి రామ సూరి రెడ్డి, ఏలూరు జిల్లాకి చెందిన రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సతీష్ రాయల్, ఏలూరు సిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బురదగుంట లివిన్ క్రిస్టియన్ పాల్గొన్నారు.ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నూనె పవన్ తేజ నాయుడు ఆధ్వర్యంలో మూడు రోజుల ట్రైనింగ్ క్యాంపు అక్టోబర్ 5, 6, 7 తేదీల్లో గుంటూరులో నిర్వహిస్తున్నారు.ఈ ట్రైనింగ్ క్యాంపుకు ఢిల్లీకి చెందిన పలువురు యూత్ కాంగ్రెస్ నేషనల్ నాయకులు హాజరై, యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, యువజన కాంగ్రెస్ కార్యకలాపాలు, నాయకత్వ లక్షణాలు,ప్రజా సమస్యలపై పోరాటం తదితర అంశాలపై శిక్షణ ఇవ్వడం జరుగుతోంది.ఈ ట్రైనింగ్ క్యాంపుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటి మెంబర్, మాజీ శాసనసభ్యులు మస్తాన్ వలి, ఆంధ్రప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఇన్చార్జ్ లెనిన్ ప్రసాద్, కో-ఇన్చార్జ్ మమతా నాగిరెడ్డి, నేషనల్ సెక్రటరీ నాగ మధు యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు, ప్రజా సమస్యలపై మరింత సమర్థవంతంగా పనిచేసేలా ఈ శిక్షణ శిబిరం ఉపయోగపడుతుందని నాయకులు తెలిపారు.


