జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా హాస్టల్ వార్డెన్ అంజనాకు స్వర్ణాంధ్ర అవార్డు
1 min read
ఈ అవార్డు అందుకోవడం ద్వారా నాకు మా సిబ్బందికి మరింత బాధ్యత పెరిగింది
సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ అంజన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కామవరపుకోట. స్థానిక సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ అంజనా కు ఏలూరు కలెక్టర్ వెట్రి సెల్వి గాంధీ జయంతి సందర్భంగా స్వర్ణాంధ్ర అవార్డును అందజేశారు. వసతి గృహ పరిసరాలను, వంటశాలను, విద్యార్థుల గదులను పరిశుభ్రంగా ఉంచడంతో జిల్లాస్థాయిలో గాంధీ జయంతి సందర్భంగా స్వర్ణాంధ్ర అవార్డును జిల్లా కలెక్టర్ కె. వెట్రి వెట్రీసెల్వి చేతుల మీదుగా అందుకున్నారు.జెసి, జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలో అందుకోవటం ఎంతో ఆనందంగా ఉందని,ఈ అవార్డు అందుకోవడం ద్వారా నాకు మా సిబ్బందికి బాలికల హాస్టల్ కావ డంతో విద్యార్థులు పట్ల ప్రత్యేకమైన అంకితభావంతో విధులు నిర్వహించడం జరుగుతుందని, ఈ అవార్డు రావటం సంతోషంతో పాటు విధుల నిర్వహణలో నాకు మా సిబ్బందికి మరింత బాధ్యతను పెంచిందని అంజన తెలిపారు. వార్డెన్ అంజనాకు అవార్డు రావడం పట్ల విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు అంజనా కు అభినందనలు తెలిపారు.


