NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పిజిఆర్ఎస్ లో బహుళ వైకల్య  దివ్యాంగుని సమస్యకు 1నిముషాలలో పరిష్కారం

1 min read

జిల్లా కలెక్టర్ కి,అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసిన కుటుంబ సభ్యులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో సమస్యతో వచ్చిన దివ్యాంగుని సమస్యకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తక్షణమే పరిష్కారం చూపారు. భీమవరం మండలం రాయలం గ్రామానికి చెందిన తోట వెంకటేశ్వరరావు కుమారుడు తోట సమీర్ బహుళ వైకల్యంతో బాధపడుతున్నారు. ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సదరం ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోగా, ధ్రువీకరణ పత్రం సక్రమంగా జారీ కాలేదు. ఈ విషయంపై సోమవారం  కలెక్టరేట్లో పిజిఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ను కలిసి తమ సమస్యను తెలియజేసి, పరిష్కరించాల్సిందిగా కోరగా, వెంటనే జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి చెందిన వైద్యాధికారి ఫోన్ చేసి సమస్యను తెలియజేసి, వెంటనే సర్టిఫికెట్ అందించాల్సిందిగా ఆదేశించారు.  అధికారులు వెంటనే స్పందించి సరిచేసి సదరం ధ్రువీకరణ పత్రాన్ని పిజిఆర్ఎస్ కార్యక్రమంలో  తీసుకువచ్చి  తోట సమీర్ కుటుంబ సభ్యులకు అందించారు.  తమ సమస్యకు సానుకూలంగా స్పందించి నిముషాల వ్యవధిలోనే పరిష్కారానికి చర్యలు తీసుకున్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కి, వైద్యాధికారులకు తోట సమీర్ కుటుంబ సభ్యులు తమ కృతఙ్ఞతలు తెలియజేసారు.  జిల్లా జాయింటు కలెక్టరు డా:యం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్. శ్రావణ్ కుమార్ రెడ్డి,  ఇంచార్జి జిల్లా రెవిన్యూ అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి,విజిలెన్స్ స్పెషల్ డిప్యూటీ కలెక్టరు యల్.దేవకీదేవి ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *