ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం
1 min read
నిత్య ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
స్వయం ఉపాధి నిమిత్తం ఎమ్మెల్యే చింతమనేని కుట్టు మిషన్ పంపిణీ
దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
ప్రతి దరఖాస్తును స్వయంగా పరిశీలించి తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుని, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా వాటికి తక్షణ పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. అదివారం దుగ్గిరాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిత్య ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు.పి4 లో భాగంగా అప్పనవీడు జనసేన వీర మహిళ తాజా మాజీ జడ్ పి హెచ్ స్.ఎస్ యం సి చైర్ పర్సన్ మోగంటి లక్ష్మీ దుర్గా కి కుట్టు మిషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన వృద్ధులు, మహిళలు, రైతులు, సామాన్య ప్రజలు తమ సమస్యలు, వినతులను ఎమ్మెల్యే గారికి స్వయంగా విన్నవించుకున్నారు.వచ్చిన ప్రతి ఒక్కరి అర్జీని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పరిశీలించి, వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ, వైద్య ఆరోగ్య తదితర శాఖలకు సంబంధించిన సమస్యలపై సంబంధిత అధికారులతో అక్కడికక్కడే ఫోన్లలో మాట్లాడి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పేదలకు వైద్య సహాయం, పింఛన్లు, గ్రామీణ మౌలిక వసతులు, భూ సమస్యలకు సంబంధించిన అంశాలపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు.


