ఆత్మవిశ్వాసంతో సాధన చేసి రాణించండి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో కటోర సాధన చేసి తాము ఎంచుకున్న క్రీడల్లో రాణించాలని రాష్ట్ర డ్రాగన్ బోట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నాగేశ్వరబాబు వ్యాఖ్యానించారు. సోమవారం రాష్ట్ర డ్రాగన్ బోట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్,జూనియర్, సబ్ జూనియర్ ఎంపిక పోటీలను ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగేశ్వరబాబు మాట్లాడుతూ క్రమం తప్పకుండా క్రీడాకారులు సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు అని అన్నారు.ఎంపికైన క్రీడాకారులు డ్రాగన్ బోట్ ఇండియా అండ్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 20 వరకు ఢిల్లీలో జరగబోయే 13 వ జాతీయస్థాయి డ్రాగన్ బోట్ ఛాంపియన్షిప్ పోటీలకు రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి, వ్యాయామ ఉపాధ్యాయులు దాస్, ప్రకాష్,ఈ ఎంపిక పోటీలకు చిత్తూరు, అనంతపూర్,కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి సుమారు 50 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్నారు.


