నాగులదేవునిపాడులో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్కు శంకుస్థాపన
1 min read
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
రూ. 29.20 లక్షలతో నిర్మించిన జల్ జీవన్ మిషన్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎమ్మెల్యే ప్రారంభం
ప్రజారోగ్యం,ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరాకే కూటమి ప్రభుత్వం పెద్దపీట
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనీ ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: గ్రామీణ ప్రజల మెరుగైన ఆరోగ్యం, స్వచ్ఛమైన రక్షిత తాగునీటి కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు. మంగళవారం దెందులూరు మండలం, గాలాయగూడెం పంచాయతీ పరిధిలోని నాగులదేవునిపాడు గ్రామంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నూతన భవన నిర్మాణానికి ఆయన శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. అనంతరం జల్ జీవన్ మిషన్ (జేజేఎం) నిధులు రూ. 29.20 లక్షల వ్యయంతో గ్రామంలో నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా పథకం ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ (OHSR) శిలాఫలకాన్ని ఆవిష్కరించి, నల్లా తిప్పి తాగునీటి సరఫరాను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల్లోనే ప్రాథమిక వైద్యం అందేలా ఆరోగ్య మందిరాలను తీర్చిదిద్దుతున్నామని, నాగులదేవునిపాడు ప్రజలకు తాగునీటి సమస్య శాశ్వతంగా తీరిపోయిందని స్పష్టం చేశారు. గ్రామాల సమగ్ర వికాసానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు బొప్పనసుధ, తెలుగు యువత అధ్యక్షులు మోత్కూరి నాని, మండల పార్టీ అధ్యక్షులు నాగనబోయిన సత్యనారాయణ, సహకార సొసైటీల చైర్మన్లు డాక్టర్: పసుమర్తి మధు,పూజారి వెంకటరత్నం నాయుడు, కూచిపూడి బాబి,యలమర్తి శ్రీనివాస్,కూటమి నాయకులు కమ్మ శివరామకృష్ణ , వెన్నమనేని రాజా, ఏనుగు రామకృష్ణ, ఎమ్మార్వో బత్తిన సుమతి, ఎంపీడీవో ప్రతాప్, పంచాయతీరాజ్ డిఇ శ్రీనివాస్ సహా పలువురు ఆర్.డబ్ల్యూ.ఎస్, వైద్యారోగ్య శాఖ అధికారులు, కూటమి నాయకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



