గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం
1 min read
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లాలో ‘ఆది కర్మయోగి అభియాన్’ కింద ఏర్పాటు చేసిన ఆది సేవా కేంద్రం (ఆది సేవ కేంద్ర ) గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ సేవలందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శి రంజాన్ చోప్రా కు తెలియజేసారు.గిరిజన గ్రామాల్లో ‘ఆది కర్మయోగి అభియాన్’ కింద ఏర్పాటు చేసిన ఆది సేవా కేంద్రాల ద్వారా గిరిజనులను అందించే సేవలపై కలెక్టర్లతో రంజాన్ చోప్రా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా రంజాన్ చోప్రా మాట్లాడుతూ గిరిజన గ్రామాలు మరియు తెగల ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతీ గిరిజనులను అందేలా ‘ఆది కర్మయోగి అభియాన్’ కింద ఏర్పాటు చేసిన ఆది సేవా కేంద్రాలు పనిచేయాలన్నారు. స్థానిక గిరిజన యువతను ఆది కర్మయోగి వాలంటీర్లు గా ఎంపిక చేసి ఈ కేంద్రాలలో నియమించాలని, వీరు గ్రామస్తులకు పథకాల దరఖాస్తు ప్రక్రియలో, డాక్యుమెంట్ల తయారీలో మరియు డిజిటల్ సేవలలో సహాయం అందించాలన్నారు.ఏలూరు కలెక్టరేట్ నుండి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లాలో ‘ఆది కర్మయోగి అభియాన్’ కింద ఏర్పాటు చేసిన ఆది సేవా కేంద్రం (ఆది సేవ కేంద్ర ), గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవలు గురించి తెలియజేసారు.


