NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం

1 min read

ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్

ఏలూరు జిల్లా ప్రతినిథి,న్యూస్ నేడు: జిల్లా అభివృద్ధి కోసం తాను, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా కృషి చేస్తున్నామన్నారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ మంగళవారం ఏలూరు నగరంలో పలు చోట్ల సీసీ రోడ్ల శంకుస్థాపనలలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా ఉదయం ఏలూరు మాదేపల్లి ఇందిరమ్మ కాలనీలో 40లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు శంకుస్థాపనలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)  కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఏలూరు 18వ డివిజన్ వంగయగూడెంలో 1 కోటి 20 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలోనూ, ఏలూరు 19వ డివిజన్ బుర్రాయిగూడెంలో 80 లక్షల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలోనూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటితోనూ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ నిరంతరం అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ఈ అభివృద్ధి కొనసాగాలంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్ధులను గెలిపించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *