NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దసరా సందర్భంగా సుళవాయి లో మండల స్థాయి కబడ్డీ పోటీలు

1 min read

కబడ్డీ టోర్నమెంట్ కు రూ 20. వేలు మొదటి బహుమతి అందజేత

క్రీడాలతో యువతలో క్రమశిక్షణ ఐక్యత పెరుగుతాయి టిడిపి సీనియర్ నాయకుడు ఈ బిజీ గోవింద్ గౌడ్

హొళగుంద న్యూస్ నేడు: దసరా పండుగను పురస్కరించుకొని హొళగుంద మండలంలోని సుళవాయి గ్రామంలో ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మండలస్థాయి కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంత యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో ఈ పోటీలను ఏర్పాటు చేశారు.ఈ కబడ్డీ పోటీలకు ప్రోత్సాహంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈబీజీ గోవింద్ గౌడ్, టీడీపీ యువ నాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్‌తో కలిసి మొదటి బహుమతిగా రూ.20,000 అందజేశారు. యువత క్రీడల్లో రాణించేందుకు తమ వంతు సహకారం అందించడం అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఈబీజీ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ, యువత చదువుతో పాటు క్రీడల్లోనూ చురుకుగా పాల్గొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాకుండా క్రమశిక్షణ, పట్టుదల, ఐక్యత, జట్టుగా పనిచేసే తత్వాన్ని అలవర్చుతాయని తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, తమలోని ప్రతిభను గుర్తించి క్రీడల్లో మంచి పేరు సంపాదించాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో అనేకమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఉన్నారని, వారికి సరైన ప్రోత్సాహం లభిస్తే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి పోటీలు యువతలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు గ్రామాల మధ్య స్నేహభావాన్ని, క్రీడాస్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు.కబడ్డీ టోర్నమెంట్‌కు మొదటి బహుమతిగా రూ.20,000 అందజేసిన ఈబీజీ గోవింద్ గౌడ్, ఈబీజీ రాజేంద్ర గౌడ్‌లకు సుళవాయి గ్రామ పెద్దలు, యువత కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు, యువత సహకరిస్తున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *