NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలూరులో మోల్ డే వేడుకలు

1 min read

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఏలూరులో రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం మోల్ డే (Mole Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు.రసాయన శాస్త్రంలో మోల్ భావన ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. వి. శ్రీనివాస్ రావు పాల్గొని,మోల్ భావనను వివరించారు.రసాయన శాస్త్రంలో రసాయన లెక్కలు, పదార్థాల పరిమాణాలను అర్థం చేసుకోవడంలో మోల్ భావన కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.కార్యక్రమ సమన్వయకర్త కె. రమేష్,రసాయన శాస్త్ర అధ్యాపకులు,మోల్ డే ప్రాముఖ్యతను వివరిస్తూ, విద్యార్థుల్లో రసాయన శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా కళాశాల బోధనా సిబ్బంది,బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని మోల్ డే ప్రాముఖ్యత గురించి తమ అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకున్నారు. మోల్ భావన రసాయన శాస్త్ర అధ్యయనంలో కీలకమైనదని, ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తాయని వారు వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు రసాయన శాస్త్రంలోని ప్రాథమిక భావనలపై అవగాహన కల్పించడంతో పాటు,శాస్త్రీయ విజ్ఞానంపై ఆసక్తిని పెంపొందించడానికి కృషి చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *