NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ట్రబుల్ మాంగర్స్,రౌడీషీటర్లు ఇబ్బందులు కలిగించొద్దు

1 min read

పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి..

నందికొట్కూరు న్యూస్ నేడు: ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవడమే మా ముఖ్య ఉద్దేశమని నందికొట్కూరు పట్టణ సీఐ డి మురళీధర్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట శుక్రవారం సాయంత్రం పట్టణ సీఐ పాత్రికేయుల సమావేశం సందర్భంగా సీఐ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అదేవిధంగా ఎన్నికల్లో ఎవరైనా సరే ప్రలోభాలకు గురిచేసినా ఆశ చూపించినా మా దృష్టికి తీసుకువస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు ప్రజలకు ఇబ్బందులకు కలిగిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఓటర్లకు పోలీసు శాఖ అండగా ఉంటుంది.మద్యం అరికట్టేందుకు వెహికల్ చెకింగ్ మరియు లాడ్జిలు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ చేస్తున్నామన్నారు.ఎన్నికల విధులకు అదనపు పోలీస్ సిబ్బంది వస్తున్నారని ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ రైడ్స్ చేయడం జరుగుతుందని సీఐ అన్నారు.

మద్యం బాటిళ్లు స్వాధీనం కేసు నమోదు

నందికొట్కూరు మార్కెట్ యార్డ్ ఎదురుగా తనిఖీలు చేస్తుండగా బొల్లవరం గ్రామానికి చెందిన బోయ వెంకటరాముడు(61) వద్దనున్న 35(180)ఎంఎల్ మద్యం బాటిళ్లు దొరికాయని ఆయనపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సైలు చంద్రశేఖర్, సురేష్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *