NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవనకొండ జడ్పిటిసి సిపిఎం అభ్యర్థిగా బోయ పావని నామినేషన్

1 min read

దేవనకొండ, న్యూస్​ నేడు:  దేవనకొండ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గానికి సిపిఎం పార్టీ అభ్యర్థిగా బోయ పావని శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గౌస్ దేశాయ్, సిపిఎం జిల్లా నాయకులు బి వీర శేఖర్, సిపిఐ దేవనకొండ మండల కార్యదర్శి నరసరావుల ఆధ్వర్యంలో పావని  నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మండల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ప్రజా సమస్యలే ఎజెండాగా పనిచేస్తున్న సిపిఎం పార్టీ అభ్యర్థిని  గెలిపించడం ద్వారా మండలం నుండి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజల సహకరించినట్లు అవుతుందని  మండలంలోని ప్రధాన సమస్యలు నుండి పంట కాలవ ల నిర్మాణం గుండ్లకొండ దగ్గర స్లూయిస్ ఏర్పాటు కరువు సమస్య పరిష్కారం గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు తాగునీరు అంటే మౌలిక సదుపాయాలు ఉపాధి అవకాశాలపై సిపిఎం పార్టీ భవిష్యత్తులో కృషి చేస్తుందని అందుకు దేవనకొండ మండల ప్రజల వాణ్నినీ   జిల్లా పరిషత్ లో  వినిపించేందుకు సిపిఎం పార్టీ అభ్యర్థి బోయ పావని ను గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు అశోక్ సూరి కుంకునూరు శాఖ కార్యదర్శి శ్రీనివాసులు కోటకొండ నాయకులు సుభాన్ దేవనకొండకు గ్రామానికి చెందిన డివైఎఫ్ఐ నాయకులు నాగేంద్ర బోయగడ్డ రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *