NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మీ అందరి సహకారంతో శక్తివంచన లేకుండా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా

1 min read

42వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ అభ్యర్థి చలువాది రూపాకళా శ్రీ పవన్ 

ప్రచారంలో పాల్గొన్న పార్టీ శ్రేణులు,అభిమానులు శ్రేయోభిలాషులు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: 42వ డివిజన్ ప్రజలు బలపరిచిన కార్పొరేటర్ అభ్యర్థిగా రూప కళాశ్రీ పవన్ కొబ్బరికాయ గుర్తు పై ఓటెయ్యాలని  ప్రచారంలో కొనసాగుతున్నారు. స్థానిక డివిజన్ నుంచి పార్టీ శ్రేణులు కార్యకర్తలు,అభిమానులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో సుడిగాలి ప్రచారం కొనసాగిస్తూన్నారు, ఒక్కసారి అవకాశం ఇచ్చి కొబ్బరికాయ గుర్తు పై ఓటేసివిజయం చేకూర్చాలని కోరారు. మంచి మెజార్టీతో గెలిపించాలని అభివృద్ధికి ఓటేయాలని డివిజన్ ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 42 డివిజన్ ల ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీరు, శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, వీధి దీపాలు,ఆహ్లాదకరమైన పార్కులు,సుంద్రీకరణ మైన  రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. డివిజన్ ప్రజలు బలపరిచిన అభ్యర్థిగా వారి ప్రోత్సాహంతో ఈ డివిజన్ నుండి విజయం సాధించి నా ఓటర్లు కి బహుమతిగా ఇస్తానని, మీ అందరి సహకారంతోనే డివిజన్ ని అభివృద్ధి చేసి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. అదేవిధంగా స్థానిక డివిజన్ లో నాకు పార్టీలకతీతంగా పెద్దలు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు  తనకు మంచి ప్రోత్సాహం ఓటర్లు అందిస్తున్నారని ఓటర్ల సహకారంతోటే ఈ విజయాన్ని సాధిస్తానని రూపకళా శ్రీ పవన్ భీమా వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *