వైకాపా అభ్యర్థులను గెలిపించండి
1 min read
49 బన్నూర్’లో ఎన్నికల ప్రచారం..
మిడుతూరు న్యూస్ నేడు: వైకాపా పార్టీ బలపరిచిన జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను గెలిపించాలని మిడుతూరు మాజీ జెడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి మరియు వైసీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం గ్రామ నాయకులు జగన్ మోహన్ రెడ్డి,పి బలరాముడు ఆధ్వర్యంలో అభ్యర్థులతో కలిసి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి గత వైకాపా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం అందించిన ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించారు.మళ్లీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందాలంటే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు.జడ్పిటిసి అభ్యర్థి రజియాభి మరియు ఎంపీటీసీ అభ్యర్థి దూదేకుల హసీనాకు మీకున్న రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటెయాలని వారు ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటరమణ,శ్రీనివాసులు, సాంబశివుడు,హరీష్ తదితరులు పాల్గొన్నారు.


