జుట్టు తెల్లబడకుండా ఈ ఆహారం తీసుకోండి
1 min read
పల్లెవెలుగు వెబ్ : చిన్న వయసులోనే చాలా మందికి యువతకు వెంట్రుకలు తెల్లబడతాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి పరిస్థితి ఎక్కువ మందికి ఎదురవుతోంది. ఇలా చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లబడటాన్ని బాలమెరుపు అంటారు. చిన్నతనంలోనే జుట్టు తెల్లబడటం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు చెబుతున్నారు. బాలమెరుపు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా జన్యుపరమైన కారణాలు, విటమిన్ బి12 లోపం, ఐరన్ లోపం, మానసిక ఒత్తిడి, ఆందోళన.. జుట్టుకు వాడే షాంపులు, దగ్గర్లో ఎవరైనా ధూమపానం చేయడం వల్ల జుట్టు తెల్లబడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఆహారంలో పాలు,పెరుగు, గుడ్లు, మాంసం తీసుకోవడం ద్వార విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు. ఇనుము కోసం ఆకుకూరలు, గింజలు తినాలి. ఆరోగ్యకరమైన జీవనశైలితో బాలమెరుపును అధిగమించవచ్చని వైద్యులు చెబుతున్నారు.