మళ్ళీ జగన్ అన్న.. మళ్ళీ పేదల పక్షం నినాదంతో ప్రచారం జోరు
1 min read
హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లో భాగంగా హోళగుంద ఎంపీటీసీ–1 స్థానం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు బి. సిద్ధలింగ మరియు బడే శ్రీదేవి లు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజం కోసం, సేవ కోసం జగనన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి, ప్రతి కుటుంబానికి సంక్షేమం అందిందని, రైతు, మహిళ, యువతకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత వైఎస్సార్ సీపీదేనని అన్నారు.ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మన గ్రామం – మన భవిష్యత్తు కోసం ఒక్క ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి వెలుగు నింపాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


