NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి: మంత్రి టీజీ భరత్

1 min read

18, 19, 20, 21వ వార్డుల్లో మేయర్ అభ్యర్థి విజయ ప్రత్యూషతో కలిసి మంత్రి విస్తృత ప్రచారం

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు నగర అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని 18, 19, 20, 21వ వార్డుల్లో కూటమి మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూషతో కలిసి మంత్రి టీజీ భరత్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని కూటమి అభ్యర్థులకు మద్దతు కోరారు. 18వ వార్డులో బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి కాశీ విశ్వనాథ్‌కు, 19వ వార్డులో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి షేక్ జకియా అక్సారికి, 20వ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థి శివమ్మ, 21వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పెరపోగు లలితకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై, బీజేపీ అభ్యర్థికి కమలం గుర్తుపై, జనసేన అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే కూటమి మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూషకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. కర్నూలు నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు రహదారులు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తోందని మంత్రి పేర్కొన్నారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు మరింత వేగంగా కొనసాగాలంటే స్థానిక సంస్థల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించడం అవసరమని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ కర్నూలు నగరాన్ని మరింత అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *