NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బెల్ట్ షాపులపై ఎక్సైజ్ అధికారుల దాడులు – 15 మంది పాత ముద్దాయిల బైండోవర్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు, కర్నూలు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. చంద్రహాస్ ఆధ్వర్యంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ఈ రోజు (27.10.2026) కర్నూలు రూరల్ మండల పరిధిలోని ఈ. తాండ్రపాడు, దేవమాడ, గొందిపర్ల ప్రాంతాల్లో బెల్ట్ షాపుల నిర్వహణకు పాల్పడుతున్న పాత ముద్దాయిలపై చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో ఆయా ప్రాంతాలకు చెందిన మొత్తం 15 మంది పాత ముద్దాయిలను కర్నూలు రూరల్ మండల తహసీల్దార్ (MRO) ఎదుట బైండోవర్ చేశారు.అదేవిధంగా, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న స్థావరాలపై దాడులు నిర్వహించారు. వీకర్ సెక్షన్ కాలనీలో ఉప్పరి మస్తాన్ వద్ద తెలంగాణ రాష్ట్రానికి చెందిన 8 మెక్‌డోవెల్స్ నం.1 లగ్జరీ విస్కీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. చంద్రహాస్ తెలిపారు.ఈ దాడుల్లో స్టేషన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. చంద్రహాస్, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీమతి రెహనా బేగం, శ్రీ నవీన్ బాబు మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *