NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంపీటీసీ’ల పోరులో 27 మంది అభ్యర్థులు

1 min read

ప్రజా తీర్పు ఎవరికి వరించనుందో..?

మిడుతూరు న్యూస్ నేడు: ఎంపిటీసీ,జడ్పిటీసీ ఎన్నికల్లో భాగంగా మిడుతూరు మండలంలో 12 ఎంపిటిసి స్థానాలకు 27 మంది అభ్యర్థులు పోటీలో నిలబడ్డారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీకాంత్ చౌదరి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు మంగళవారం పార్టీల అభ్యర్థుల బీ ఫారాలను ఎన్నికల అధికారికి అభ్యర్థులు అందజేశారు.కొందరు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. టిడిపి-12,వైసీపీ-12, స్వతంత్ర అభ్యర్థులు-2 బీఎస్పి పార్టీ-1 పోటీలో నిలబడ్డారు.

బరిలో ఉన్న టిడీపీ అభ్యర్థులు

మిడుతూరు-1 ఖాతా రమేష్ రెడ్డి,మిడుతూరు-2 విద్యా పోగుల అశోక్, చెరుకుచెర్ల-గద్దెల రానెమ్మ,   అలగనూరు-మిద్దె స్వాములు,మాసపేట- దూదేకుల హుస్సేన్ భాష, కడుమూరు-ఎస్ అబ్జర్, నాగలూటి-డి షాజహాన్, చింతలపల్లి-వై సుజాతమ్మ, చౌటుకూరు-దండుగుల వెంకటేశ్వర్లు,జలకనూరు- బండారు మేరమ్మ, తలముడిపి-బంగి ఇస్రత్, వీపనగండ్ల-చందాపురం శ్రీలక్ష్మి బరిలో ఉన్నారు.

బరిలో ఉన్న వైకాపా అభ్యర్థులు

మిడుతూరు-1 తువ్వా లోకేశ్వర్ రెడ్డి, మిడుతూరు-2 విద్యా పోగుల లాజర్,

నాగలూటి-తుపాకుల బిపాషా,మాసపేట- దూదేకుల హసీనా, చౌటుకూరు-మాదిరెడ్డి భూపాల్ రెడ్డి,చెరుకుచెర్ల- గద్దల వెంకటలక్ష్మమ్మ, కడుమూరు-దర్జీ షఫీ ఉల్లా, చింతలపల్లె-బుచ్చి రెడ్డి  రాజేశ్వరి,జలకనూరు- సిరిగిరి సుభాషిణి,  తలముడిపి-బంగి రహిమున్నిసా,వీపనగండ్ల-రామిరెడ్డి  రమణమ్మ మరియు చెరుకుచెర్ల నుండి  స్వతంత్ర అభ్యర్థులు గద్దల మాణిక్ రాజు,మాణిక్యమ్మ  వీరు అభ్యర్థుల బరిలో ఉన్నారు.ఇప్పటికే వివిధ గ్రామాల్లో అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మండలంలో అభ్యర్థుల ఉపసంహరణ ముగియడంతో పల్లెల్లో ఎన్నికల సందడి రసవత్తరంగా మారింది. ఎక్కడ ఏ గ్రామంలో చూసినా ఎన్నికల చర్చే మరి వచ్చే నెల నవంబర్ మూడవ తేదీన ఎంపిటిసి జెడ్పిటిసి ఎన్నికలు జరగనున్నాయి.మరి ప్రజా తీర్పు ఎవరికి వరించనుందో వేచి చూడాల్సిందే.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *