NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దీపావళి పండుగను ఆనందంగా సురక్షి తంగా జరుపు కునేలా చర్యలు చేపట్టాలి

1 min read

బాణసంచా విక్రయదారులు తప్పనిసరిగా ముందస్తు లైసెన్సులు పొందాలి

జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ

మదనపల్లె, న్యూస్ నేడు ప్రతినిధి  :ప్రజలందరూ దీపావళి పండుగను ఆనందంగా, సురక్షి తంగా జరుపు కునేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదేశించారు. బాణసంచా విక్రయ కేంద్రాల నిర్వాహ కులు తప్పనిసరిగా ముందస్తు లైసెన్సులు పొందడంతో పాటు, ప్రభుత్వ నిబంధ నలు, అగ్నిమాపక భద్రతా ప్రమాణాల ను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు.నవంబర్ 8న దీపావళి పండుగను పురస్కరించుకొని బాణసంచా భద్రతా నిర్వహణపై డివిజనల్ అధికారులు,  పోలీసు, అగ్ని మాపక, విద్యుత్, రెవెన్యూ, మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితర అధికారులతో మంగళవారం మదనపల్లె కలెక్టరేట్‌ నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అగ్నిప్రమాదాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ మ్యాన్ కమిటీ సూచనలను బాణసంచా విక్రయ దారులు తప్పని సరిగా పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవా లన్నారు.నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకో వాలని స్పష్టం చేశారు.ఈ నిబంధనల అమలుపై సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేష్, ఆర్డీవోలు శ్రీనివాస్, విజయలక్ష్మి, ఆయా శాఖల జిల్లా అధికారులు మండల అధికారులు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *