60 రోజుల మెగా డ్రైవ్ ను ప్రారంభించిన జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి”
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు ఆరవ అదనపు జిల్లా జడ్జి, ఫుల్ అడిషనల్ ఛార్జ్, జిల్లా ప్రధాన న్యాయ మూర్తి మరియు చైర్మన్ పి. వాసు గారి సూచనల మేరకు ఈ రోజు అనగా 29.10.2026 న గూడూరు మండలం గుడిపాడు గ్రామం నందు జాతీయ న్యాయ సేవల పథకాలపై 60 రోజుల మెగా డ్రైవ్ ను ప్రారంభించిన కర్నూలు,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి. జాతీయ న్యాయ సేవల 13 పథకాలపై గుడిపాడు గ్రామం నందు ప్రజలకు అవగాహన కల్పించి ఆ పథకాలను గ్రామంలోని ప్రజలకు అందేలా ఈ 60 రోజుల మెగా డ్రైవ్ లో చేస్తామని తెలిపారు. ఈరోజు నుంచి 60 రోజులపాటు ప్రతిరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు నియమించిన ప్యానల్ న్యాయవాదులు మరియు ప్యారా లీగల్ వాలంటీర్లు గుడిపాడు గ్రామాన్ని సందర్శించి ఈ పథకాలపై ప్రజలకు అవగాహన కలిగించి వారికి ఆ పథకాల లబ్ధి అందేలా కృషి చేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో కర్నూలు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియంవద మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవ పథకాలను ప్రజలకు అందించడంలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.గూడూరు తాసిల్దార్ వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ ప్రజలందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నూలు,డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ కార్మికులందరికీ లేబర్ కార్డులను అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కర్నూలు ట్రైని డిప్యూటీ కలెక్టర్ ప్రియంవద, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ వెంకటేశ్వర్లు గూడూరు తాసిల్దార్ వెంకటేష్ నాయక్, గూడూరు డిప్యూటీ ఎంపీడీవో మధులత, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సునీలమ్మ, గూడూరు సబ్ రిజిస్టర్ శ్రీధర్ గుప్తా, గూడూరు సిడిపిఓ వరలక్ష్మి, గూడూరు ఎస్సై రాజకులయప్ప, గుడిపాడు పంచాయతీ సెక్రటరీ సలీం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ శివరామచంద్రరావు, లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్,ప్యారా లీగల్ వాలంటీర్స్ పాల్గొన్నారు.


