రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు వెంకటేశ్వరి ఎంపిక
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ ఎంపీసీ చదువుతున్న విద్యార్థిని వెంకటేశ్వరి రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లా స్థాయిలో నిర్వహించిన సైక్లింగ్ పోటీల్లో ఆమె ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం తెలిపారు.ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థిని వెంకటేశ్వరిని ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం, అధ్యాపక బృందం అభినందించారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో క్రీడల్లో రాణించి కళాశాలకు, జిల్లాకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.


