మీకు ఎప్పుడూ అందుబాటులో వుండాలన్నదే నా లక్ష్యం
1 min read
మీ ఓటు ఒక వ్యక్తి గెలుపు కోసం కాదని,మన డివిజన్ భవిష్యత్తు కోసమని ఆలోచన చేయాలి
18 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి లక్కింశెట్టి సుస్మిత కిరణ్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నేను మీకు ఎన్నో హామీలు ఇచ్చి మిమ్మల్ని మభ్యపెట్టాలని అనుకోవడం లేదు. మీ సమస్యలను వినాలి, సాధ్యమైన పరిష్కారాల కోసం కృషి చెయ్యాలి, మీకు ఎప్పుడూ అందుబాటులో వుండాలన్నదే నా లక్ష్యం అని 18వ డివిజన్ ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి లక్కింశెట్టి సుస్మిత కిరణ్ అన్నారు. ఏలూరు నగరపాలక సంస్థలో జరిగే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుతో పోటీ చేస్తున్నారు. వారు డివిజన్ ఓటర్లకు సందేశమిస్తూ నేనుగెలిచిన తర్వాత ప్రజల మధ్యకి రావడం కాదు.ప్రజల మధ్య ఉంటూ, వారి నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన న్యాయకత్వమన్నరు.మీ కష్టాల్లో మీకు తోడుగా వుంటాను. మీ సమస్యల పరిష్కారం కోసం అధికారుల దగ్గరకు వెళ్తాను. పరిష్కరిస్తాను.డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై మీరు వేసే ప్రతీ ఓటు ఒక వ్యక్తి గెలుపు కోసం మాత్రమే కాదు. మన డివిజన్ భవిష్యత్తు కోసం అని ఆలోచన చైయ్యలన్నారు.నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. మీ నమ్మకాన్ని పరిపూర్ణంగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నారన్నరు. గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి నాకు అఖండ విజయాన్ని చేకూర్చాలని సుస్మిత కిరణ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.


