జడ్పిటీసీగా నన్ను ఆశీర్వదించండి
1 min read
వైసీపీ జెడ్పిటిసి అభ్యర్థి రజియాభీ
యుగంధర్ రెడ్డి 5 వేల ఆర్థిక సహాయం..
మిడుతూరు న్యూస్ నేడు: వైకాపా ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి సాధ్యమని జడ్పిటిసి గా మీ ఆశీర్వాదంతో నన్ను గెలిపిస్తే మండలాన్ని నందనవనంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మిడుతూరు మండలం వైసిపి జడ్పిటిసి అభ్యర్థి రజియాబి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని నాగలూటి గ్రామంలో గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా జడ్పిటిసి అభ్యర్థి మరియు ఎంపీటీసీ అభ్యర్థి బి పాషాతో కలసి మరి జెడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు.గత జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఇల్లు లబ్ధి చేకూరిందని వైసీపీ అధికారంలోకి వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రెండు ఓటర్లు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
యుగంధర్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేత
గ్రామంలో 20 రోజుల క్రితం మరణించిన యువకుడు శాంతరాజు కుటుంబానికి మాజీ జడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి 5 వేలు ఆర్థిక సహాయం కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ నభి రసూల్, మాజీ సొసైటీ చైర్మన్ నాగ తులసి రెడ్డి,కరీం తదితరులు పాల్గొన్నారు.



