విద్యార్థుల్లో ఆవిష్క రణలకు వేదిక విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో ఐడియా ల్యాబ్
1 min read
మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి : అంగళ్లులోని విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో ఏ ఐ సి టి ఈ ఐడియా ల్యాబ్ ను గురు వారం ఘనంగా ప్రారంభించారు.ఈ ల్యాబ్ ను కళాశాల చైర్మన్ ఎం. ప్రభాకర్ రెడ్డి, డైరెక్టర్ ఎం. నందితా రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా. బి.డి. వెంకట రమణ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా. బి. సుబ్బారెడ్డి, డీన్స్, అన్ని విభాగాల హెచ్ ఓ డి లు, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఐడియా ల్యాబ్ కో-ఆర్డినేటర్ డా. నందా కిషోర్ ఎస్ ల్యాబ్ యొక్క లక్ష్యాలు, విజన్, అందుబాటులో ఉన్న ఆధునిక సౌకర్యాలను వివరించారు. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ టీమ్ ను అభినందించారు. క్యాంపస్ లో ఇన్నోవేషన్ కల్చర్ ను నిర్మించడంలో ల్యాబ్ పాత్రను నొక్కి చెప్పారు. అన్ని విభాగాల విద్యార్థులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీన్స్, హెచ్ ఓ డి లు లు సూచిం చారు. ఈ సందర్భంగా చైర్మన్ ఎం. ప్రభాకర్ రెడ్డి ఐడియా ల్యాబ్ ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలను ఆధునిక పరిక రాలతో వర్కింగ్ ప్రోటోటైప్ లుగా మార్చుకునేందుకు ప్రత్యక్ష వేదిక అన్నారు. డిజైన్ థింకింగ్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాబ్రికేషన్, సమస్య పరిష్కారం వంటి ప్రాక్టికల్ స్కిల్స్ బలోపేతం.వివిధ విభాగాల విద్యార్థులు కలిసి వాస్తవ ప్రపంచసమస్యలపై పనిచేసే అవకాశం.విద్యార్థి ఆవిష్క ర్తలను ప్రోత్స హించడం, స్టార్టప్ ఆలోచనలకు మద్దతు, ఆత్మ విశ్వాసం, సృజనా త్మకత ళ్ళ, ప్రాజెక్ట్ అనుభవంతో కెరీర్ కు సిద్ధం చేయడం. స్థానిక, సామాజిక సవాళ్లకు విద్యా ర్థుల ఆధ్వర్యంలో పరిష్కారాలు కనుగొనడం,విద్యార్థులు పాఠ్య పుస్తకాలకు మించి ఆలోచించి ఐడియా ల్యాబ్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ కోరారు. విద్యార్థి ఆవిష్క ర్తలకు వనరులు, మెంటార్ షిప్ తో సంస్థ అండగా ఉంటుందని డైరెక్టర్ తెలిపారు.



