మీ అందరి సహకారంతో శక్తివంచన లేకుండా డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా
1 min read
32వ డివిజన్ ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి తాతపూడి సుప్రీత్
ప్రచారంలో పాల్గన్న టిడిపి పార్టీనాయకులు,కూటమి శ్రేణులు,అభిమానులు శ్రేయోభిలాషులు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: 32వ డివిజన్ ఎన్డీఏ, కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా తాతపూడి సుప్రీత్ ప్రచారంలో కొనసాగుతున్నారు. స్థానిక డివిజన్ నుంచి టీడీపీ పార్టీ శ్రేణులు,నాయకులు కార్యకర్తలు,అభిమానులు, కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులతో ప్రచారం కొనసాగిస్తూనారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఉన్నత విద్యావంతుడు మనందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి సుప్రీత్ ని గెలిపించాలని అభివృద్ధికి ఓటేయాలని డివిజన్ ప్రజలను కోరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ బలపరిచిన అభ్యర్థిగాసీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆదేశాలతో,ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ప్రోత్సాహంతో 32వ డివిజన్ నుండి సైకిల్ గుర్తుతో విజయం సాధించి తెలుగుదేశం పార్టీకి, ఎన్డీఏ కూటమి కి,డివిజన్ ఓటర్లు కి బహుమతిగా ఇస్తానని,మీ అందరి సహకారంతోనే డివిజన్ ని స్వచ్ఛమైన త్రాగునీరు,డివిజన్ అంతట వీధి దీపాలు,డ్రైనేజీ సౌకర్యాలు,పక్క సిసి రోడ్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సువిశాలమైన పార్కులు మరింత మౌలిక సదుపాయాలను తీసుకురావడానికి కృషితో ,అభివృద్ధి చేసి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని అన్నారు. అదేవిధంగా స్థానిక డివిజన్ లో తనకు మంచి ప్రోత్సాహం ఓటర్లు అందిస్తున్నారని ఓటర్ల సహకారంతోటే ఈ విజయాన్ని సాధిస్తానని తాతపూడి సుప్రీత్ భీమా వ్యక్తం చేశారు.


