NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

1,2,11,14, 32 వార్డుల్లో సిద్ధార్థ రెడ్డి ఎన్నికల ప్రచారం

1 min read

ఏబీఎం పాలెం ప్రజలకు అండగా ఉంటా

అభ్యర్థుల గెలుపుకు విస్తృత ప్రచారం..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పురపాలక ఎన్నికల ప్రచారంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కౌన్సిలర్ అభ్యర్థుల కోసం శుక్రవారం విస్తృత ప్రచారం చేశారు.పట్టణంలో ఏబీఎం పాలెం 1,2 వార్డుల్లో సిద్ధార్థ రెడ్డి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రచార రథంపై నుండి మాట్లాడుతూ పాలెం వార్డుల కౌన్సిలర్ల అభ్యర్థులు కాటేపోగు చిన్న రాజు,రాధమ్మ మరియు చైర్మన్ అభ్యర్థి ఫాతిమాభికి రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.ఇక్కడ ఓట్లు వేయకపోతే అవి తీసేస్తాం ఇవి తీసేస్తాం అంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఏ ఒక్కరికీ తీసేసినా సిద్ధార్థ రెడ్డి మీకు అండగా ఉంటాడని ఎవరు వస్తారో మీరు రండంటూ సిద్ధార్థ రెడ్డి సవాల్ విసిరారు.ముందుగా ముందుగా ఈ కాలనీలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి మహిళలు ప్రజలు నుండి విశేష స్పందన లభించింది.

శబాన,నాయబ్, మహేశ్వరమ్మ లను గెలిపించండి

11వ వార్డు వైసీపీ అభ్యర్థి షేక్ షబానా సంగయ్య పేట  మరియు 14 వ వార్డ్ అభ్యర్థి షేక్ నాయబ్,32 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి చిమ్మే మహేశ్వరమ్మలతో కలిసి సిద్ధార్థ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు.రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వస్తేనే అభివృద్ధి చెందుతుందన్నారు.ఈ కార్యక్రమంలో లడ్డు,రమేష్,యాట ఓబులేష్ తదితర నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *