NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

31వ వార్డ్ ఖాసీం వలిని గెలిపించండి

1 min read

ఎన్నికల ప్రచారంలో డాక్టర్ సుధీర్

ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం..

నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని 31 వ వార్డ్ కౌన్సిలర్ వైసీపీ అభ్యర్థి  సెంట్రింగ్ ఖాసీం వలిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నందికొట్కూరు వైసిపి ఇన్చార్జి డాక్టర్ ధారా సుధీర్ అన్నారు.శుక్రవారం ఉదయం వార్డులో డాక్టర్ ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఫాతిమాభి మరియు కౌన్సిలర్ అభ్యర్థికి రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు.ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ప్రజలకు మోసపూరిత వాహనాలు చేసి మోసం చేసిందని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. జగనన్న ప్రభుత్వం వస్తేనే వార్డు పట్టణం గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఓటర్లతో అన్నారు.కాలనీలో డాక్టర్ సుదీర్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.

ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం

పట్టణంలో మున్సిపాలిటీ చైర్మన్లు మరియు వార్డుల కౌన్సిలర్లు అభ్యర్థులు నామినేషన్లు వేసినప్పటి నుండి వివిధ వార్డుల్లో ఓట్లను రాబట్టుకునేందుకు ఇంటింటికి వెళ్లి నాయకులు అభ్యర్థులు ఓటర్లను అభ్యర్థించారు.ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిన్న శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది.రేపు ఆదివారం పట్టణంలో ఎన్నికల పోలింగ్ జరగనుంది.ఈ కార్యక్రమంలో బ్రహ్మయ్య ఆచారి,నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *