NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండలో ఘనంగా ఏఐటీయూసీ 107వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (ఏఐటీయూసీ) 107వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను శని వారం పత్తికొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ఎన్. కృష్ణయ్య ఏఐటీయూసీ జెండాను ఆవిష్కరించారు. ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు నెట్టకంటయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఏ ఐ టి యు సి పతాకావిష్కరణ చేశారు. అనంతరం క్రిష్ణయ్య మాట్లాడుతూ, కార్మికుల హక్కుల సాధన కోసం, కార్మిక వర్గ ఐక్యత కోసం ఏఐటీయూసీ ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం పోరాటాలు చేస్తోందని తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, పని ప్రదేశాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.అసంఘటిత రంగ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, పారిశ్రామిక కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ మరింత బలమైన ఉద్యమాలు చేపడుతుందని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి హెచ్ రంగన్న, సిపిఐ మండల సహయ కార్యదర్శి కె. పెద్ద వీరన్న వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి వై. వెంకట్రామిరెడ్డి, ఏఐటీయూసీ తాలూకా ఉపాధ్యక్షులు ఎం రాజప్ప హమాలీ సంఘం కార్మికులు, ఆటో యూనియన్ కార్మికులు రాజేష్, పొట్ట రంగన్న, అశోక్,శివ, ఉశేని, బూడిద శేఖర్,యల్లప్ప, రఫీ, ఉచ్చన్న,వి.కె.నగర్ శంకర్ ,దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *