NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసిపి సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం 

1 min read

న్యూస్ నేడు, పత్తికొండ:  వైసిపి, సిపిఐ అభ్యర్థులను ఓట్లు వేసి గెలిపించాలని పత్తికొండ పట్టణంలోని బండిగేరి, ముస్లింవీధి, చౌడమ్మ వీధి కాలనీలలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ , మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ , సిపిఐ  రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య  విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించారు.ఈ సందర్భంగా పత్తికొండ పట్టణ ఎంపీటీసీ-1, జెడ్పీటీసీ అభ్యర్థులను పరిచయం చేస్తూ, రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.ఈ ప్రచార కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *