NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపకులు  మడుపల్లి మోహన గుప్త 82వ జన్మదిన వేడుకలు

1 min read

హిందూ యువజన సంఘం (వై.ఎం.హెచ్.ఏ.)వివిధ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సన్మాన కార్యక్రమం

అక్టోబర్ 31 శనివారం ఏలూరులోని వై.ఎం.హెచ్.ఏ. ఏ.సి. హాలులో ఘనంగా కార్యక్రమం

వేడుకల్లో 49 సంస్థల ప్రతినిధులు, వేద పండితులు, ప్రముఖుల మద్య పెద్ద సంఖ్యలో సత్కరం

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు:​ సాంస్కృతిక, కళా, సేవా, ఆధ్యాత్మిక మరియు విద్యా రంగాలకు విశేష సేవలందిస్తున్న గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మడుపల్లి మోహన గుప్త 82వ జన్మదిన వేడుకలు మరియు ఆత్మీయ సన్మాన కార్యక్రమం అక్టోబర్ 31 శనివారం ఏలూరులోని వై.ఎం.హెచ్.ఏ. ఏ.సి. హాలులో ఘనంగా నిర్వహించబడింది.హిందూ యువజన సంఘం (వై.ఎం.హెచ్.ఏ.), ఏలూరు మరియు వివిధ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో 49 సంస్థల ప్రతినిధులు, వేద పండితులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని,మడుపల్లి మోహన గుప్త మల్లేశ్వరి దంపతులను వేదమంత్రోచ్చరణల నడుమ ఘనంగా సత్కరించారు. కళారత్న కె.వి. సత్యనారాయణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.  ఏలూరు శ్రీ కాంచీ కామకోటి స్మార్త వేద పాఠశాల విద్యార్థులచే వేదమంత్రాలతో వేద ఆశీర్వచనం, పఠనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జరిగిన సత్కార కార్యక్రమంలో ఎం.ఎం. గుప్తా మల్లీశ్వరి దంపతులను ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ పండితులచే వేద ఆశీర్వచన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు యర్రా సోమలింగేశ్వరరావు, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు యిరదల ముద్దుకృష్ణ, మాజీ శాసనసభ్యులు అంబికా కృష్ణ, డాక్టర్ వి.వి. బాలకృష్ణారావు, లునాని బ్రదర్స్ తదితరులు మాట్లాడుతూ గుప్త దంపతుల సేవా గుణాన్ని, సమాజ హితానికి వారు అందిస్తున్న దాన వితరణలను కొనియాడారు. భారత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ/పద్మ విభూషణ్ అవార్డును గుప్తా గారి సేవ వితరణ గుర్తించి అందచేయాలని అభిలాషించారు. డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు గుప్తా సేవ నిరతిని గూర్చి సభకు పరిచయం చేశారు.

​కార్యక్రమంలో పాల్గొన్న వై.ఎం.హెచ్.ఏ. మేనేజ్‌మెంట్ కమిటీ

​అంబికా రాజా (గౌరవ అధ్యక్షులు) ,​జవ్వాజి మోహనవిఠల్ (గౌరవ అధ్యక్షులు),వేమా కోటేశ్వరరావు (ఉపాధ్యక్షులు-3)  ​డా॥ గుడిపాటి లలితాశర్మ (సహాయ కార్యదర్శి-2)  ​కానాల బాలవెంకట రమేష్ (కోశాధికారి),వై.ఎం.హెచ్.ఏ. కార్యనిర్వాహక కమిటీ సంకు సురేష్ ఉపాధ్యక్షులు-1,ఎల్. వెంకటేశ్వరరావు (ఎల్వీఆర్) (ఉపాధ్యక్షులు-2) ,మజ్జి సూర్యకాంతారావు (ప్రధాన కార్యదర్శి) సభ్యులు మోతే శ్రీనివాస నారాయణరావు, రేవూరి శివ శంకర వరప్రసాద్  పెదపాటి రామకృష్ణ,శలా మాణిక్యాలరావు (రాజాబాబు),గుడిమెట్ల అచ్యుత,నేలపాటి రోహిత్,​ కొత్తగుండు శ్రీనివాస్,కె. హేమంత్‌కుమార్,ఎ. పార్వతీరామచంద్రన్,ఎం. సూర్యనారాయణ యాదవ్,పి. కొండలరావు,డి. హేమసుందరరావు,ఎం.వి. రవీంద్ర, కొమ్మన వెంకటరమణ తదితర సభ్యులు,సమిష్ఠ సంస్థల ప్రతినిధులు, నగరవాసులు,కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *