మండల పరిషత్లో ప్రజా సమస్యలపై గళం వినిపిస్తాం – అవకాశం ఇవ్వండి
1 min read
సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా నాయకుల పిలుపు
న్యూస్ నేడు, పత్తికొండ: మండల పరిషత్లో ప్రజా సమస్యలపై గళం వినిపిస్తూ, ప్రజల తరఫున నిరంతరం పోరాడేందుకు సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆవుల శేఖర్ పిలుపునిచ్చారు.శనివారం పత్తికొండ పట్టణంలోని వివిధ కాలనీలు, తాండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 6వ ఎంపీటీసీ అభ్యర్థి జి. నెట్టె కంటయ్య, 7వ ఎంపీటీసీ అభ్యర్థి వాకిటి కవిత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సి. శ్రీరంగడును ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సహాయం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని అన్నారు.ప్రజల సమస్యలను గుర్తించి, వాటిపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే నాయకులకు ప్రజలు అవకాశం కల్పించాలని కోరారు. పత్తికొండ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి యు. కారుమంచి, సీపీఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎన్. కృష్ణయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భాస్కర్ నాయక్, సీపీఐ జిల్లా సమితి సభ్యులు కారన్న, ఈరన్న, తిమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.


