గాలివీడు మండలంలో పలు గ్రామాల్లో సుగవాసి – మండిపల్లి ఎన్నికల ప్రచారం
1 min read
గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమేకం
గ్రామాలలో సుగవాసి, మండిపల్లికి పూలదండలు మంగళ హారతులతో జననీరాజనం
అన్నమయ్య జిల్లా అక్టోబర్ 31 ( సి వెంకట్రామరాజు న్యూస్ నేడు బ్యూరో) : అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లోని గాలివీడు మండలంలోని పలు గ్రామాలలో శనివారం తెలుగుదేశం పార్టీ, కూటమి నాయకులు ఎన్నికల ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాలివీడు జడ్పిటిసి అభ్యర్థి సుగవాసి ప్రసాద్ బాబు , మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి మండలంలోని ఎగువగొట్టివీడు, గోరాన్ చెరువు, అరవీడు, గాలివీడు తదితర గ్రామాల్లో పర్యటించారు.ప్రతి గ్రామంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మమేకమయ్యారు. గ్రామస్థులను కలుసుకుని స్థానిక ఎన్నికల గురించి, గ్రామ సమస్యలు, ప్రజల అభిప్రాయాల గురించి చర్చించారు.ఈ సందర్భంగా పలుచోట్ల మహిళలు పూలదండలు, మంగళహారతులతో నాయకులకు ఆత్మీయ స్వాగతం జననీరాజనం పలికారు. కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అరవీడు గ్రామంలో మందపాటి రవీంద్రబాబు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం గాలివీడు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రామ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికల ప్రచార నిర్వహణ, గ్రామస్థాయి సమన్వయం, స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా నవంబర్ 5న జరగనున్న గాలివీడు జడ్పిటిసి ఎన్నికల నేపథ్యంలో సుగవాసి ప్రసాద్ బాబు తన ఎన్నికల ప్రచారంలో సైకిల్ గుర్తు గురించి ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమాల్లో స్థానిక తెలుగుదేశం, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



