చిన్నమండెం వై సిపి జడ్పిటిసి అభ్యర్థి అక్రమ అరెస్ట్
1 min read
పోలీసులే అభ్యర్థి వాహనంలో డబ్బు పెట్టినట్లు గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపణ
ప్రజాస్వామ్యంలో ఓటు అడిగే హక్కు కూడా లేదా..?
వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి
అన్నమయ్య జిల్లా అక్టోబర్ 31 (సి వెంకట్రామరాజు న్యూస్ నేడు బ్యూరో) అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం లో స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నమండెం మండలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థి దేవనాద్ రెడ్డి శనివారం పడమటి కోన , దిగువగొట్టివీడు, చాకిబండ గ్రామాలలో శాంతియుతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి తిరిగి వస్తుండగా కొత్తపల్లి వద్ద పోలీసులు అక్రమంగా అరెస్టు చేసినట్లు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పత్రికా ప్రకటన చేశారు. దేవనాధ రెడ్డి వాహనంలో పోలీసులే డబ్బులు పెట్టి, అనంతరం వీడియోలు, ఫోటోలు తీసుకుని దేవనాధ రెడ్డి , మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు బాబు రెడ్డి, ముసల్ రెడ్డి, డ్రైవర్ సుధాకర్ లను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి కొంగు కాస్తూ, ఇలా విచ్చలవిడిగా వైసిపి పార్టీ నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యంలో ఓటు అడిగి హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. అధికార పార్టీలో ఉంటూ వారు మాత్రం ఎక్కడ ఓటు కూడా అడగకుండా, అక్రమ దారిలో వెళుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పేర్కొన్నారు. వైయస్సార్ పార్టీ తరఫున అభ్యర్థులు శాంతియుతంగా ప్రచారం చేసుకుంటూ ఓటు అడుగుతుంటే ఇలా అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో ఇష్టానుసారంగా వివరించడం, పోలీసులే వైసిపి అభ్యర్థుల వాహనాలలో డబ్బు పెట్టడం, వెంటనే అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజల గమనిస్తూనే ఉన్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని తెలిపారు. దిగువగొట్టి వీడు చాకిబండ గ్రామాలలో వైఎస్ఆర్ సిపి జెడ్ పి టి సి అభ్యర్థి దేవనాథరెడ్డికి బ్రహ్మరథం పట్టిన ఆయా గ్రామాల ప్రజలు దిగువగొట్టివీడు,చాకిబండ గ్రామాలలో వైఎస్ఆర్ సిపి జెడ్ పి టి సి అభ్యర్థి దేవనాథరెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు దేవనాథరెడ్డికి బ్రహ్మరథం పట్టారు. ఇంటింటా ఆత్మీయ స్వాగతాలు, కర్పూర హారతులుతో స్వాగతం పలికారు. సంక్షేమ పాలన అందించిన గత జగనన్న ప్రభుత్వానికి కృతజ్ఞతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తామని , జెడ్ పి టి సి అభ్యర్థి దేవనాథరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని ఆయా గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు.రెండు గ్రామాలలో ఎన్నికల ప్రచారం ముంగించికుని కొత్తపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న దేవనాథరెడ్డి, ఇతర వైఎస్ఆర్ సిపి నాయకులుపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు.


