తెదేపా జోరుగా విస్తృత ప్రచారం
1 min read
మిడుతూరు,చౌటుకూరు తలముడిపి’లో ప్రచారం..
మిడుతూరు న్యూస్ నేడు: తెలుగుదేశం పార్టీ బలపరిచిన జడ్పిటిసి ఎంపిటిసి అభ్యర్థులను మీ అమూల్యమైన ఓటుతో గెలిపించాలని టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి మరియు మిడుతూరు మండల టీడీపీ జడ్పిటిసి అభ్యర్థి భర్త సంపంగి రవీంద్రబాబు అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మరియు చౌటుకూరు గ్రామంలో సోమవారం టిడిపి అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంపంగి హైమావతి మిడుతూరులో ఎంపిటిసి అభ్యర్థి అశోక్,ఖాతా రమేష్ రెడ్డి,చౌటుకూరు,గుడిపాడు లో ఎంపిటిసి అభ్యర్థి డి వెంకటేశ్వర్లు అభ్యర్థుల గెలుపు కోసం వారితో పాటు క్లస్టర్ ఇంచార్జి కమతం రాజశేఖర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని వారు ఓటర్లను కోరారు. అదేవిధంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని దీవించాలని వారు కోరారు.తలముడిపిలో ఎంపిటిసి అభ్యర్థి బంగి ఇస్రత్ తో కలిసి టిడిపి సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్చార్జి వంగాల శివరామిరెడ్డి,రమణారెడ్డి కలసి ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఖాతా మోహన్ రెడ్డి,యరభం ప్రమోద్ రెడ్డి,శ్రీధర్ రెడ్డి,చక్రి, నరసింహ గౌడ్,శబ్బు తదితరులు పాల్గొన్నారు.



