పీరు సాహెబ్ పేట,చెరుకుచెర్ల’లో ప్రచారం
1 min read
తెదేపా అభ్యర్థుల గెలుపు తద్యమంటున్న నేతలు..
మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో మిడతూరు మండల తెలుగుదేశం పార్టీ జడ్పిటిసి అభ్యర్థి సంపంగి హైమావతి,నాగలూటి ఎంపీటీసీ అభ్యర్థి దూదేకుల షాజహాన్ మరియు గ్రామ నాయకులు విస్తృత ప్రచారం చేశారు.ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ గ్రామాలను కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ ముందంజలో తీసుకువెళ్తూ ఉందని అభివృద్ధికే పట్టం కట్టాలని జడ్పిటిసి అభ్యర్థి ఓటర్లను కోరారు.రెండు ఓట్లను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తర్వాత సాయంత్రం చెరుకుచెర్ల గ్రామంలో ఎంపిటిసి అభ్యర్థి రానెమ్మతో కలిసి జెడ్పిటిసి అభ్యర్థి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సోమ సుందర్ రెడ్డి,ఈ.రామేశ్వర్ రెడ్డి,డి జయ రాముడు,మీనిగ మహేశ్వర్ రెడ్డి,మర్రికుంట మహేశ్వర్ రెడ్డి,తెలుగు యువత తాలూకా అధ్యక్షులు డి వెంకటేశ్వర్ రెడ్డి,చక్రి,విష్ణు వర్ధన్ రెడ్డి,పుల్లారెడ్డి,నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


