NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గజ్జెహళ్లిలో స్వతంత్ర అభ్యర్థి ఈడిగ గోవింద్ గౌడ్ ప్రచారానికి ప్రజల స్పందన

1 min read

ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ ప్రాధాన్యత.. ఒక్క అవకాశం ఇవ్వండి: ఈడిగ గోవింద్ గౌడ్

తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధిలైట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

తండ్రి గెలుపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొన్న కుమారులు రాజేంద్ర గౌడ్, రాజశేఖర్ గౌడ్

హోళగుంద న్యూస్ నేడు: కర్నూలు జిల్లా హోళగుంద మండల పరిధిలోని గజ్జెహళ్లి గ్రామంలో జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి ఈడిగ గోవింద్ గౌడ్ ఎన్నికల ప్రచారం కొనసాగింది. ప్రచారంలో భాగంగా ఆయన తన కుమారులు ఈడిగ రాజేంద్ర గౌడ్, ఈడిగ రాజశేఖర్ గౌడ్‌తో కలిసి గ్రామంలోని వివిధ కాలనీల్లో పర్యటిస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. వృద్ధులు, మహిళలు, యువకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మౌలిక సదుపాయాల సమస్యలను వివరించిన ప్రజలు

గ్రామంలోని పలు కాలనీల్లో తాగునీటి ఇబ్బందులు, మురుగునీటి కాలువల సమస్యలు, సీసీ రోడ్లు లేకపోవడం, వీధిలైట్లు సక్రమంగా పనిచేయకపోవడం వంటి సమస్యలను స్థానికులు అభ్యర్థి దృష్టికి తీసుకొచ్చారు. వర్షాకాలంలో రహదారులపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.ప్రజలకు అందుబాటులో ఉంటా.. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఈ సందర్భంగా ఈడిగ గోవింద్ గౌడ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం కృషి చేయాలనే సంకల్పంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. గజ్జెహళ్లి గ్రామ ప్రజలు తనకు ఒక్క అవకాశం కల్పించాలని కోరారు.తనను ఇంటి బిడ్డగా భావించి ఆదరించాలని, ఎన్నికల్లో గెలిపిస్తే తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, వీధిలైట్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మాటలకే పరిమితం కాకుండా అభివృద్ధి పనుల కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.

తండ్రి కోసం కుమారుల ప్రచారం

ఎన్నికల ప్రచారంలో ఈడిగ గోవింద్ గౌడ్ కుమారులు ఈడిగ రాజేంద్ర గౌడ్, ఈడిగ రాజశేఖర్ గౌడ్ చురుగ్గా పాల్గొన్నారు. తండ్రితో కలిసి గ్రామంలోని వివిధ వీధులు, కాలనీల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకున్నారు. తండ్రి ఎన్నికల ప్రచారానికి మద్దతు కోరుతూ ప్రజలతో మమేకమయ్యారు.

ఏసీ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థన

రాబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో తన ఎన్నికల గుర్తు ఏసీ గుర్తుపై ఓటు వేసి తనకు మద్దతు తెలపాలని ఈడిగ గోవింద్ గౌడ్ గజ్జెహళ్లి గ్రామ ఓటర్లను కోరారు. ప్రజల సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి కోసం పనిచేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *