NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓటు హక్కు సరి చూసుకోండి…

1 min read

వెలుగోడు , న్యూస్​ నేడు:  వెలుగోడు సహకార సంఘం పరిధిలో గల సహకార సంఘ సభ్యులకు, సహకార సంఘంలో రుణాలు తీసుకున్న వారికి, సహకార సంఘంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు సరి చూసుకోవాలని అధ్యక్షులు శివ శంకర రెడ్డి , సిఇఓ జంబులయ్య ఒక ప్రకటన లో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనవరి నెలలో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిoది. వెలుగోడు సహకార సంఘం నందు మీ  ఓటు హక్కు ఉన్నదా లేదా అని చెక్  చేసుకుని ఉన్న ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. లేనియెడల వారి ఓటు హక్కును తొలగించబడును కావున దయచేసి మా సహకార సంఘం నందు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు వచ్చి తమ ఓటును చెక్ చేసుకుని కచ్చితంగా నిర్ధారించుకోవాల్సిందిగా కోరుచున్నాము. తమ వెంట ఆధార్ కార్డు జిరాక్స్ ,పొలం పాస్ పుస్తకం జిరాక్స్, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు , వన్ బీ తీసుకొని  ఓటు హక్కును వినియోగించుకోగలరు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *