లైసెన్స్ లేకుండా ఫ్యాక్టరీ నడిపిన వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటాం
1 min read
నిర్ణిత లైసెన్స్ రుసుము 2026 డిసెంబరు 31లోపు సియఫ్ యంఎస్ లేదా ఫాక్టరీస్ పోర్టల్ ద్వారా చెల్లించాలి
కర్మాగారాల తనిఖీ అధికారి కె.కృష్ణ మూర్తి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు : ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారము ప్రతి కర్మగారము యొక్క యజమాని తమ కర్మాగారము యొక్క ప్రొఫైల్ ను factories.ap.gov.in ద్వారా తేది: 31.12.2026 లోపు సృష్టించవలసినదిగా దీనికి సంబందించి ఏమైనా సందేహాలు ఉన్నచో 8309565683 మొబైల్ నెంబరును సంప్రదించాలని ఏలూరు కర్మాగారాల ఉప ముఖ్య తనిఖీ అధికారి మరియు కర్మాగారాల తనిఖీ అధికారి కె.కృష్ణ మూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం యొక్క నిబంధనల ప్రకారము కర్మాగారముల యాజమాన్యాలు 2027 వ సంవత్సరమునకు చెల్లించవలసిన లైసెన్స్ ఫీజులలో మార్పులు జరిగినందున ఫీజు వివరములను నిర్దారించుకుని [పట్టిక ద్వారా] నిర్ణిత లైసెన్స్ రుసుము 2026 డిసెంబరు 31 వ తారీకులోపు సి యఫ్ యం ఎస్ లేదా ఫాక్టోరీస్ పోర్టల్ ద్వారా చెల్లించాలని,హెడ్ అఫ్ ఎకౌంటు మరియు డి.డి.ఓ కోడ్ లలో ఎటువంటి మార్పు లేదని, ఫాక్టరీలో అదనంగా హౌర్స్ పవర్ బిగించిన, అదనంగా పనివారలను నియమించిన పెరిగిన దాని ప్రకారం బ్యాలన్సు ఫీజు కడుతూ ఆక్రమదారు బదిలీ,ఫ్యాక్టరీ పేరు మార్పు ఉన్న ఎడల లైసెన్సుల బదిలీలకు మరియు సవరణకు దరఖస్తూ చేసుకోవాలని తెలిపారు. గడువులోపల సరిపడ లైసెన్సు రుసుమునకు చలానా కట్టనిచో లైసెన్స్ రుసుముపై అదనముగా నెలకు రెండు శాతం వడ్డి చెల్లించవలసి ఉంటుందన్నారు. లైసెన్స్ రుసుము చెల్లించని వారి లైసెన్స్ రద్దు చేస్తామని, లైసెన్స్ లేకుండా ఫ్యాక్టరీ నడిపిన వారిపై చట్టరీత్య చర్య తీసుకోన బడునని ఆయన తెలియజేశారు.


