NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆజాద్ ఆశయాలే సమాజ అభివృద్ధికి మార్గదర్శకాలు!

1 min read

విద్య, జాతీయ సమైక్యత, మతసామరస్యానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు చిరస్మరణీయం

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతి వేడుకలు – ఎస్‌డీపీఐ ఆధ్వర్యంలో నివాళులు

హొళగుంద న్యూస్ నేడు: భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి, గొప్ప విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138వ జయంతిని పురస్కరించుకొని హొళగుందలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి, సమాజానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమానికి ఎస్‌డీపీఐ ఆలూరు అసెంబ్లీ అధ్యక్షుడు ఎఫ్. అబ్దుల్ హమీద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహనీయుడని కొనియాడారు. దేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడటమే కాకుండా, స్వాతంత్ర్యం అనంతరం దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ముఖ్యంగా భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యారంగ అభివృద్ధికి పునాదులు వేసి, విద్య ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలనే గొప్ప లక్ష్యంతో పనిచేశారని పేర్కొన్నారు.ఆజాద్ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా గొప్ప ఆలోచనాపరుడిగా, రచయితగా, విద్యావేత్తగా దేశ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఐకమత్యంతో జీవించాలని, మతం, కులం, భాష పేరుతో ప్రజల మధ్య విభేదాలు రాకూడదని ఆయన ఎప్పుడూ ఆకాంక్షించేవారని గుర్తుచేశారు. జాతీయ సమైక్యత, మతసామరస్యం, లౌకికవాదం, సామాజిక ఐక్యత కోసం ఆయన చేసిన కృషి నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని వివరించారు.ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి చేసిన సేవలను నాయకులు మరోసారి స్మరించుకుంటూ, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్‌డీపీఐ ఉపాధ్యక్షుడు కే. సలాం, కార్యదర్శి అబ్దుల్ రెహమాన్, ప్రధాన కార్యదర్శి ఎం. హఫీజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *