ఉపాధ్యాయులను భయాందోళనలకు గురిచేయడం తగదు – డీటీఎఫ్
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ: సుప్రీంకోర్టు తీర్పు, ఎన్‌సీటీఈ (NCTE) నిబంధనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన స్పెషల్ టెట్ పరీక్షపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో వివాదాలు సృష్టించి, ఉపాధ్యాయులను అనవసరమైన గందరగోళానికి, భయాందోళనలకు గురిచేయడం సమంజసం కాదని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (DTF) కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి జి. భీమన్న గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.దాదాపు 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు సైతం సుప్రీంకోర్టు తీర్పు, ఎన్‌సీటీఈ నిబంధనల నేపథ్యంలో టెట్ అర్హత సాధించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించడం సముచితమైన చర్యగా భావిస్తున్నామని తెలిపారు.స్పెషల్ టెట్ అనేది ఉద్యోగ నియామక పరీక్ష కాదని, కొత్త ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉద్యోగాల్లో కొనసాగుతున్న ఉపాధ్యాయుల అర్హతకు సంబంధించిన పరీక్ష మాత్రమేనని, అటువంటి పరీక్షను అడ్డుకోవడం ద్వారా ఎవరికి ప్రయోజనం కలుగుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.ఏ పోటీ లేదా అర్హత పరీక్ష నిర్వహణలోనైనా అభ్యర్థుల సన్నద్ధత కోసం సిలబస్, మాదిరి ప్రశ్నలు, బిట్ బ్యాంకులు అందించడం సాధారణ ప్రక్రియేనన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల స్పెషల్ టెట్ కోసం విద్యాశాఖ 16,000కు పైగా మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ అందుబాటు లోకి తీసుకురాగా, వాస్తవ పరీక్షలో కేవలం 150 ప్రశ్నలు మాత్రమే ఉంటాయని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు పరీక్షకు సమర్థవంతంగా సన్నద్ధమయ్యేందుకు కల్పించిన ఈ అవకాశంపై అనవసరం.


