NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యోగుల సంక్షేమ పథకం ‘సంజీవని’ తో ఆర్థిక సహాయం

1 min read

అటవీ సంరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగుల సంక్షేమానికి శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది

జిల్లా అటవీ శాఖ అధికారి  సందీప్ రెడ్డి

‘వన సంజీవని’ పథకం ద్వారా దివంగత

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కుటుంబానికి ₹5.13 లక్షల ఆర్థిక సహాయం అందజేత

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అమలు చేస్తున్న ఉద్యోగుల సంక్షేమ పథకం ‘సంజీవని’ ద్వారా దివంగత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కొవ్వాసు కృష్ణ కుటుంబానికి మంగళవారం ఏలూరులోని జిల్లా అటవీ కార్యాలయంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఏలూరు డివిజన్, కన్నపురం రేంజ్ పరిధిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO)గా విధులు నిర్వహిస్తూ గత జనవరిలో మృతి చెందిన కొవ్వాసు కృష్ణ కుటుంబానికి ప్రభుత్వం ఈ ఆర్థిక భరోసా కల్పించింది. ఈ మేరకు జిల్లా అటవీ శాఖ అధికారి (డి యఫ్ ఓ) సందీప్ రెడ్డి, ఐ యఫ్ ఎస్ చేతుల మీదుగా దివంగత ఉద్యోగి భార్య  కొవ్వాసు గంగాదేవికి మొత్తం ₹5,13,563/- విలువైన చెక్కులను అందజేశారు.

ఇందులో:సంజీవని ఎక్స్గ్రేషియా కింద: ₹5,00,000/- (చెక్కు నెం. 996532)          సంజీవని చందా నిధి వాపసు (రీఫండ్) కింద: ₹13,563/- (చెక్కు నెం. 996533) ఈ సందర్భంగా డీఎఫ్ ఓ  సందీప్ రెడ్డి మాట్లాడుతూ  అటవీ సంరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్న క్షేత్రస్థాయి ఉద్యోగుల సంక్షేమానికి శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, విధి నిర్వహణలో లేదా సర్వీసులో ఉండగా ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబాలను ఆదుకోవడానికే ‘సంజీవని’ పథకం దోహదపడుతుందని తెలిపారు. కష్టకాలంలో బాధిత కుటుంబానికి అటవీ శాఖ ఎల్లవేళలా వెసలుబాటుగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది మరియు మృతుని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *