ఎమ్మెల్యే వర్గం కౌన్సిలర్లు..బైరెడ్డి వర్గంలో చేరిక
1 min read
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో ఇద్దరు కౌన్సిలర్లు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వర్గంలో చేరారు.నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య వర్గానికి చెందిన 29 వ వార్డ్ కౌన్సిలర్ గుంజేపల్లె భాస్కర్ రెడ్డి,మరియు 30 వ వార్డ్ కౌన్సిలర్ గుంజేపల్లి విజయలక్ష్మి భర్త నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తండ్రి మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నందికొట్కూరులో ఆయన స్వగృహంలో గురువారం వారు కలిసి బైరెడ్డి వర్గంలో చేరారు.బైరెడ్డిని కౌన్సిలర్ భాస్కర్ రెడ్డి మరియు విజయలక్ష్మి భర్త పూలమాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి,బంగారు వెంకటేశ్వర్లు,గూడూరు రవికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


