49 బన్నూరులో బూడిదైనా ఏళ్ళనాటి వృక్షం
1 min read
చిన్న అగ్గిపుల్ల పొరపాటుకు వృక్షం బలి..
మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో గత ఎన్నో ఏళ్లుగా ఉన్న చెట్టు మంటల్లో బూడిద అయింది. గ్రామంలోని కందూనది దర్గా దగ్గర ఉన్న దాదాపు 200 సంవత్సరాల క్రితం చింత చెట్టుకు గత రెండు రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున చెట్టు మొదలు దగ్గర నిప్పు అంటించడంతో అది కాస్త లోపల సొరంగంలో రగులుకుంటూ శుక్రవారం ఉదయం చెట్టు బయట విపరీతంగా మంటలు రావడంతో అంటుకోవడంతో చెట్టు ఎక్కడ విరిగి పడుతుందోనని ప్రయాణికులు భయాందోళన చెందారు. గమనించిన స్థానికులు ట్రాక్టర్ సహాయంతో నీళ్లను స్ప్రే చేసినా వంటలు అదుపులోకి రాలేదు.ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు తర్వాత చెట్టు లోపల నుంచి మంటలు అధికమై చెట్టు కొమ్మలు రోడ్డుపై విరిగిపడడంతో మిడుతూరు-ఓర్వకల్లు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.చెట్టు మొత్తం రగులుకుంటూ మొత్తం బూడిద పాలు అయ్యింది. ఎన్నో ఏళ్ల క్రితం వేసిన ఎవరో చెట్టును నాటితే ఎవరో చేసిన చిన్న తప్పిదానికి చెట్టు బూడిద పాలు అవటంతో గ్రామాల ప్రజలు చిన్న పొరపాటు చేసిన వారిపై అసహ్యించుకుంటున్నారు. విద్యుత్తు అంతరాయం లేకుండా లైన్మెన్ షఫీ సిబ్బందితో కలిసి చుట్టుపక్కన ఉన్న వైర్లు కట్ చేసి వేరే మార్గం ద్వారా గ్రామానికి కరెంట్ సౌకర్యం కల్పించారు.


