NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రాలయంలో రూ.85 కోట్లతో బాపూరం గ్రాండ్ హోటల్

1 min read

150 మందికి ఉపాధి అవకాశాలు

సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌లో పర్యాటక శాఖ మంత్రి సమక్షంలో ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ

మంత్రాలయం న్యూస్ నేడు :  ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధికి మరో ముందడుగు పడింది. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో పర్యాటక, ఆతిథ్య రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో బాపూరం గ్రాండ్ హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.85 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చింది. ఈ పెట్టుబడి ద్వారా సుమారు 150 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.విశాఖపట్నంలో నవంబర్ 13న నిర్వహించిన 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్–2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంస్థ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. సంస్థ తరఫున డైరెక్టర్ బి. రవీందర్ రెడ్డి పాల్గొని మంత్రి కందుల దుర్గేష్‌తో ఒప్పంద ప్రక్రియను పూర్తి చేశారు.మంత్రాలయం మండలంలోని కల్లుదేవకుంట గ్రామంలో నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక హోటల్‌ను ఐటీసీ ఫార్చ్యూన్ హోటల్స్ బ్రాండ్ అనుబంధంతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని సంస్థ ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే మంత్రాలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు మెరుగైన వసతి, ఆతిథ్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.అదేవిధంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం లభించనుంది. రూ.85 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ హోటల్ ప్రాజెక్టు మంత్రాలయం ప్రాంత పర్యాటక అభివృద్ధికి, ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని డైరెక్టర్ బి. రవీందర్ రెడ్డి పేర్కొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *